Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshMLA జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించిన అన్నా క్యాంటీన్‌లు

MLA జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించిన అన్నా క్యాంటీన్‌లు

-

Chat on WhatsApp

ఎమ్మిగనూరులో MLA డా. బి. వి. జయనాగేశ్వర రెడ్డి గారు సోమప్ప, శ్రీనివాస సర్కిళ్లలో 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్‌లను ప్రారంభించారు.

ఈ క్యాంటీన్‌లు ముఖ్యంగా నిరుపేదలు, యాచకులు, రైతులు, విద్యార్థులకు కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మద్యానం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నాయని చెప్పారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఆకలిని తీర్చేందుకు ఈ క్యాంటీన్‌లను ప్రారంభించామన్నారు.

స్థానిక నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం పొందుతారని MLA తెలిపారు.

MLA జయనాగేశ్వర రెడ్డి స్వయంగా క్యాంటీన్‌ను పరిశీలించి, ఆహార నాణ్యతను పరీక్షించి నిరుపేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు, కార్యకర్తలు MLAతో కలిసి పాల్గొన్నారు, మరియు క్యాంటీన్ ప్రారంభం జరిపారు.

MLA జయనాగేశ్వర రెడ్డి, ఈ క్యాంటీన్‌ల ద్వారా నిరుపేదలకు ఆకలి కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పల్లెల్లో అన్నా క్యాంటీన్‌లు పునఃప్రారంభమవుతుండటంతో ప్రజలకు పెద్ద ఉపశమనంగా ఉందని స్థానికులు అభినందించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp