US Tariffs on India: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US Tariffs) తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి “స్కాట్ బెసెంట్” సూచనప్రాయంగా వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అదనంగా “25 శాతం సుంకాలు” విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై మొత్తం “50 శాతం టారిఫ్‌లు” అమల్లో ఉన్నాయి.
ఓ ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. “రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై 25 శాతం సుంకాలు విధించాం. అయితే ఆ తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. ఇది మా దృష్టిలో పెద్ద విజయం.
ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉండొచ్చని నేను భావిస్తున్నాను” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సుంకాల తగ్గింపుపై సంకేతాలుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికా వాణిజ్య మంత్రి “హోవార్డ్ లుట్నిక్’ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదని, అమెరికా అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్”తో ప్రధాని “నరేంద్ర మోదీ’ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమెరికా మంత్రులు భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హంగా మారింది.
ALSO READ:Telangana Jagruthi Local Elections | పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జాగృతి సిద్ధం







