Saturday, March 21, 2026
Google search engine
HomeAndhra PradeshAP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు...

AP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు ఇవే 

-

Google search engine

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగజాతర మొదలు కానుంది. నిరుద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వం త్వరలోనే “జాబ్ క్యాలెండర్” విడుదల చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తయింది.

మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం మొత్తాన్ని “నిధి HRMS పోర్టల్” ద్వారా అప్‌డేట్ చేస్తోంది. అందిన సమాచారం మేరకు మొత్తం శాఖల్లో సుమారు “30% పోస్టులు ఖాళీగా” ఉన్నట్లు తెలుస్తోంది.

వీటిలో కొన్ని స్థానాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం ఖాళీలు “99,000కి పైగా” ఉండే అవకాశం ఉంది.

also read:Maoists Surrender Letter | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…ఫిబ్రవరి 2026 వరకు..


“విభాగాల వారీగా ఖాళీలు:”

“రెవిన్యూ శాఖ:” 13,000 ఖాళీలు, వీటిలో 2,552 నేరుగా భర్తీ అయ్యే పోస్టులు.
“ఉన్నత విద్య:” 7,000 ఖాళీలు; విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా స్థానాలు.
“పురపాలక శాఖ:” 27,000లో 23,000 పోస్టులు భర్తీ చేసే అవకాశం.
“నైపుణ్యాభివృద్ధి శాఖ:” 4,000 ఖాళీలు; 2,600 పోస్టులు సిద్ధం.
“వ్యవసాయ శాఖ:” 3,000+ ఖాళీలు; DR పోస్టులు సుమారు 2,400.
“పంచాయతీరాజ్:” 26,000 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం.
“మహిళ & శిశుసంక్షేమ శాఖ:” 2,400 ఖాళీలు; 1,820 పోస్టులు సిద్ధంగా ఉన్నాయి.
“పాఠశాల విద్య:” బోధన, బోధనేతర కలిపి 30,000 ఖాళీల అవకాశం.
“ఆరోగ్య శాఖ:” సుమారు 10,000 పోస్టులు.

ఇంకా 24 శాఖల ఖాళీల వివరాలు నిర్ధారణలో ఉన్నాయి. మొత్తం లెక్కలు పూర్తవగానే, ఏపీ నిరుద్యోగులకు భారీ నియామకాల అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine