Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచంద్రబాబుకు వరద బాధితుల పట్ల సానుభూతి

చంద్రబాబుకు వరద బాధితుల పట్ల సానుభూతి

-

Chat on WhatsApp

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై నిన్న అర్ధరాత్రి  11.30 గంటలకు ఆయన ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివర ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రారంభంలోనే ఆహార పొట్లాలను బాధితులు తీసుకుంటుండటంతో… అవి చివరి వరకు చేరలేకపోతున్నాయని తెలిపారు. 

తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఏడాది వయసున్న బాబును పట్టుకుని బయటకు వచ్చాడని… సార్, బాబు ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లో భార్యను వదిలేసి బయటకు వచ్చానని చెప్పాడని… తన భార్య ఫలానా చోట ఉందని, ఆమె ప్రాణాలు మీరే కాపాడాలంటూ వేడుకోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని సీఎం తెలిపారు. ఒకచోట వృద్ధ దంపతులు వరద నీటిలో తడిసిపోయి, నిస్సహాయ స్థితిలో కనిపించారని… వారి స్థితి తనను కలచివేసిందని చెప్పారు. 

సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని… ఈ కష్టకాలంలో విధినిర్వహణలో అధికారులు అలసత్వం వహించవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాబోయే మూడు రోజులు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. వరద తగ్గాక పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, పునరావాసం కల్పించాలని అన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకున్న తర్వాతే తాను ఇక్కడి నుంచి బయల్దేరుతానని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donation and service activities on ram charan birthday from chiranjeevi

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు...

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ...
- Advertisement -
Chat on WhatsApp