Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నివాసంలో కీలక భేటీ

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నివాసంలో కీలక భేటీ

-

Chat on WhatsApp

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి నివాసంలో నేడు బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. వైసీపీ అరాచక పాలన వల్లే కూటమికి ఓట్లు వేశారని తెలిపారు. ఇక, అధినాయకత్వం పిలుపు ఇచ్చిన మేరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా ముఖ్యమంత్రితో చర్చించామని పురందేశ్వరి వెల్లడించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ… వైసీపీ అరాచకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారని, ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని సత్యకుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp