Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshVishaka Utsav 2026: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ

Vishaka Utsav 2026: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ

-

Chat on WhatsApp

Vishaka Utsav 2026: ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపద, ప్రకృతి సౌందర్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించనుంది. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే నినాదంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది.

విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి పాల్గొన్నారు.

ALSO READ:Hyderabad Model Corridor | హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త….మూసీ నది వెంట కొత్త మోడల్ కారిడార్

ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జనవరి 24న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్‌కు శ్రీకారం చుట్టి, ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 20 ప్రధాన కేంద్రాల్లో 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp