సీనియర్ల వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య
మానవత్వాన్ని మరిచిపోయే ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు మరోసారి ఓ అమాయక విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్సింగ్ పెద్ద కుమారుడు జాదవ్ సాయితేజ, ఘట్‌కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. నారపల్లిలోని హాస్టల్‌లో ఉంటూ చదువులు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ…
