Manchu Lakshmi | బెట్టింగ్ యాప్‌ల కేసులో సీఐడీ విచారణ
Betting Apps Case: నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి మంచు లక్ష్మి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏ అంశాలపై విచారణ?బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో మంచు లక్ష్మి పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. ఆయా యాప్‌ల ప్రమోషన్‌కు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమిషన్ల రూపంలో ఎంత మొత్తం పొందారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు…
