Redmi Note 15 Pro 5G భారత్ లాంచ్ డేట్ కన్ఫర్మ్

redmi note 15 pro 5g smartphone with 200mp camera redmi note 15 pro 5g smartphone with 200mp camera

Redmi Note 15 Pro: Redmi భారత్‌లో తన కొత్త “Redmi Note 15 Pro సిరీస్” లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi, ఈ సిరీస్‌ను “జనవరి 29న భారత్‌లో విడుదల చేయనున్నట్లు” వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఫోన్‌లు Xiaomi ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

Redmi Note 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కు 200 మెగాపిక్సెల్ ‘మాస్టర్ పిక్సెల్’ రియర్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు “OIS, HDR + AI” సపోర్ట్ ఉండగా, “4K వీడియో రికార్డింగ్” సామర్థ్యం కూడా కల్పించారు. డిజైన్ పరంగా ఈ సిరీస్ బ్రౌన్, గోల్డ్ ఫ్రేమ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభించనుంది.

ఫోన్ భద్రత విషయంలో కూడా Redmi ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Corning Gorilla Glass Victus రక్షణతో పాటు IP66, IP68, IP69, IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు అందించారు.

పవర్ బ్యాక్‌అప్ కోసం “6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ”, “100W హైపర్‌చార్జ్”, “22.5W రివర్స్ ఛార్జింగ్” సపోర్ట్ ఉంటుంది. ఈ డివైస్ “Qualcomm Snapdragon 7s Gen 4 (4nm)” చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా “12GB RAM” వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ALSO READ:Top 4 Unbreakable Records in ODI Cricket | వన్డే ఇంటర్నేషనల్స్‌లో బ్రేక్ కాని 4 రికార్డులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *