* సంఘటన స్థలం: కెపి కళాశాల వెనుక
* సంఘటనా వీడియో వైరల్
* అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభం
Prayagraj Army Plane Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఆర్మీ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ సంఘటన కెపి కళాశాల వెనుక చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న విమానం చెరువులో కూలింది.
సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
విమానం కూలిన కారణాలను తెలుసుకోవడానికి ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పైలట్ లేదా ఇతర సిబ్బందికి ఎలాంటి గాయాలు జరిగాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ:Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్
