Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan Response on Visakhapatnam Illegal Beef Case Pawan Kalyan Response on Visakhapatnam Illegal Beef Case

Visakhapatnam:విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న ముఠాలను తక్షణం గుర్తించాల్సిందిగా విశాఖ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని పవన్ స్పష్టం చేశారు.

ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించి, కేసు వివరాలు తెలుసుకున్నారు. డీఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజ్‌(Mitra Cold Storage)పై దాడులు నిర్వహించి “1.89 లక్షల కిలోల గోమాంసం”స్వాధీనం చేసుకుని కేసును పోలీసులకు అప్పగించినట్టు కమిషనర్ వివరించారు.

ALSO READ:Hindupur Siravaram Clash:సంతకాల కార్యక్రమం ఉద్రిక్తం – టీడీపీ, వైసీపీ గుంపుల మధ్య ఘర్షణ 

కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మాంసం ఎక్కడి నుంచి వచ్చినది, ఎక్కడికి తరలించాలనుకున్నారన్న కోణంలో దర్యాప్తు సాగుతున్నట్టు తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

అక్రమ గోవధ, గోమాంసం విక్రయాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, NDA పశుసంరక్షణ విధానాల అమలులో ఇది నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురంలో అక్రమ జంతు వధశాలను మూసివేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *