Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadకుక్క పిల్లలను కొట్టి చంపిన వ్యక్తిపై ఆగ్రహం

కుక్క పిల్లలను కొట్టి చంపిన వ్యక్తిపై ఆగ్రహం

-

Chat on WhatsApp

హైదరాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి పాపం ఏమరుపాటు లేకుండా ఉన్న ఐదు కుక్క పిల్లలను నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటన అక్కడి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు వెంటనే అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

దాంతో అసలైన నిజం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారి ఆశిష్ అనే వ్యక్తే ఈ అమానుష ఘటనకు కారణమని తెలిసింది. అతని పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని, కోపంతో ఆ వీధి కుక్క పిల్లలను హింసించి చంపేశాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలపై ఇలాంటి క్రూర చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదంటూ కఠిన శిక్షల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇటువంటి ఘటనలు జంతుశ్రేయస్సు కోసం రూపొందించిన చట్టాలపై ప్రశ్నలు వేస్తున్నాయి. తక్షణ చర్యలు తీసుకుని ఆ వ్యక్తిని శిక్షించాల్సిన అవసరం ఉందని సమాజం భావిస్తోంది. నేరానికి తగిన విధంగా శిక్షించడమే ఇలాంటి ఘటనలకి అడ్డుకట్ట అవుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donation and service activities on ram charan birthday from chiranjeevi

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు...

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ...
- Advertisement -
Chat on WhatsApp