Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeNationalTamil Nadu | మహిళలకు ₹5,000 గిఫ్ట్ ఇచ్చిన MK Stalin...ఎందుకంటే ?

Tamil Nadu | మహిళలకు ₹5,000 గిఫ్ట్ ఇచ్చిన MK Stalin…ఎందుకంటే ?

-

Chat on WhatsApp

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి “ఎంకే స్టాలిన్” మహిళలకు కీలక శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నేరుగా జమ చేసినట్లు సీఎం ప్రకటించారు.

ఈ మొత్తంలో రూ.2,000ను “సమ్మర్ స్పెషల్ సహాయంగా”, అలాగే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ఇవ్వాల్సిన రూ.3,000ను ముందుగానే అందించినట్లు స్టాలిన్ తెలిపారు. మహిళలకు ఆర్థిక భద్రత, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు.

ఎన్నికల కారణంగా కొందరు ఈ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన సీఎం, ఎంతటి అడ్డంకులు వచ్చినా మహిళల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని మహిళలను ఆయన కోరారు.

also read:TS Municipal Results | పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp