Monday, March 23, 2026
Google search engine
HomeAndhra PradeshHome Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

Home Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

-

Google search engine

Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు అనిత పేర్కొన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.

మహిళా భద్రతను  ప్రభుత్వం  ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసారు. ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్నది రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశంగా మారింది.

also read:PM Modi on Vande Mataram | వందేమాతరం కేవలం పాట కాదు… అది దేశ ఆత్మగౌరవం

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై 10 కేజీల సిలిండర్ మాత్రమే?

న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇళ్లలో వినియోగిస్తున్న 14.2 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల...
- Advertisement -
Google search engine