అంత సీఎం చేతిలోనే..రాజీనామాకైనా సిద్ధం: ఎమ్మెల్యే దానం నాగేందర్

Danam Nagender clarifies his stand on MLA resignation amid disqualification debate Danam Nagender clarifies his stand on MLA resignation amid disqualification debate

Danam Nagender resignation: ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై దానం స్పందిస్తూ, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తనకు కొత్త ఏమి కాదని, ఇవన్నీ తన రాజకీయ ప్రయాణంలో భాగమని తెలిపారు.

ప్రస్తుతం తనపై అనర్హత పిటిషన్ విచారణలో ఉందని చెప్పారు. అదే సమయంలో సీఎం రేవంత్(CM REVANTH) నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్(BRS)నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత దానం రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెరిగాయి. స్పీకర్ మరోసారి నోటీసు జారీ చేయడంతో దానం ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపారు.ఉప ఎన్నిక అనంతరం కీలక పదవి ఆఫర్ లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ:Chittoor Road Accident | కార్వేటి నగరం బోల్తా పడ్డ లారీ, బస్సు ఢీకొట్టి ఒకరు మృతి 

బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, లోక్‌సభలో సికింద్రాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయన పార్టీ మార్పు స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విచారణ కొనసాగితే అనర్హత అవకాశాన్ని తప్పించుకునేందుకు రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు దానం తన వైఖరిని స్పష్టంచేశారు. సుప్రీం కోర్టు సహా స్పీకర్ వద్ద తన అనర్హత కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పరిణామాలను బట్టి భవిష్యత్తులో తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తనకు అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పారు. ఎన్నో ఎన్నికలు చూశానని, గెలవడం తన రక్తంలో భాగమని వ్యాఖ్యానించారు. రేవంత్ మరో పదేళ్లు కొనసాగితే అభివృద్ధి నిరాటంకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *