Saturday, March 21, 2026
Google search engine
HomeMaharashtraSunetra Pawar | సునేత్ర పవార్ ఎన్సీపీ అధినేతగా?

Sunetra Pawar | సునేత్ర పవార్ ఎన్సీపీ అధినేతగా?

-

Google search engine

Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసింది. ఎన్సీపీ కీలక నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృ**తి చెందడం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ(NCP)కి కొత్త నాయకత్వం ఎవరు అన్న చర్చ మొదలైంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీ అధినేతగా ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ పేరు బలంగా వినిపిస్తోంది.

శరద్ పవార్‌తో విభేదాల అనంతరం ఎన్సీపీ చీలిపోయి, మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్(Ajit Pawar) వెంటే నిలిచారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఆ వర్గానికి ఇప్పుడు సరైన నాయకత్వం అవసరమైంది. ఈ సమయంలో సునేత్ర పవార్‌కు రాజకీయంగా, భావోద్వేగంగా మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధారశివ జిల్లాకు చెందిన సునేత్ర పవార్ రాజకీయ, రైతు కుటుంబ నేపథ్యం కలిగినవారు. మాజీ మంత్రి పద్మసింగ్ పాటిల్ సోదరిగా ఆమెకు రాజకీయ అనుభవం ఉంది. 2024లో బారామతి నుంచి సుప్రియా సూలేపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, వెంటనే రాజ్యసభకు ఎంపికయ్యారు.

సామాజిక కార్యకర్తగా, విద్యా నిర్వాహకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బారామతి టెక్స్‌టైల్ సంస్థ చైర్‌పర్సన్‌గా, EFOI వ్యవస్థాపకురాలిగా పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలు అందించారు. అజిత్ పవార్ భార్యగా మాత్రమే కాకుండా, స్వంత గుర్తింపుతో ఎదిగిన నేతగా ఆమెను పార్టీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ:Rajamouli’s Best Film | రాజమౌళి కెరీర్‌లో ఆ సినిమానే బెస్ట్ సినిమా: డైరెక్టర్ గుణశేఖర్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine