Techie couple online reception: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సమస్య మధ్య ఓ కొత్త జంటకు విభిన్న అనుభవం ఎదురైంది. కర్ణాటకకు చెందిన మేధా క్షీర్‌సాగర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన సంగమ దాస్(software couples) హుబ్బళ్లి(hubballi)లో కుటుంబసభ్యుల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు.
బెంగళూరు — హుబ్బళ్లి ప్రయాణానికి బుక్ చేసిన విమానాలు పైలట్ల కొరత, సిబ్బంది రోస్టర్ లోపాల కారణంగా రద్దు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

విమానం నిరంతర ఆలస్యం కావడంతో చివరకు వారి ప్రయాణం రద్దయింది. ఇదే సమయంలో భువనేశ్వర్ — ముంబై — హుబ్బళ్లి మార్గంలో ప్రయాణించాల్సిన బంధువుల విమానాలు కూడా రద్దయడం సమస్యను మరింత పెంచింది.
ALSO READ:భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు
దీంతో భువనేశ్వర్‌లో చిక్కుకున్న నూతన దంపతులు రిసెప్షన్‌ను వదులుకోకుండా వర్చువల్‌గా పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లోనే సిద్ధమై, రిసెప్షన్ హాలులో ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా అతిథులకు దర్శనమిచ్చారు. బంధువులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని ఆశీర్వదించగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
