పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ఫణీంద్ర చికిత్సకు సాయం చేయాలని కోరగా, సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల సాయం అందించారు. ఈ నేపథ్యంలో, పుతుంబాక భారతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథం చూపించారంటూ కొనియాడారు.
- Home
- Andra Pradesh News
- సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
