Home ENTERTAINMENT బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో – రాజ్ కుంద్రాకు ముంబయి కోర్టు ఊరట

బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో – రాజ్ కుంద్రాకు ముంబయి కోర్టు ఊరట

0
raj kundra appearing before mumbai special court in bitcoin case

Raj Kundra: బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు ముంబయి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆయనకు తదుపరి తేదీల్లో కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో Enforcement Directorate దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న పీఎంఎల్‌ఏ కోర్టు గత నెలలో రాజ్ కుంద్రాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అనుమతించింది.


క్రిప్టో కుంభకోణ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన 285 బిట్‌కాయిన్లు స్వీకరించారని ఈడీ ఆరోపించింది. ఈ లావాదేవీల వివరాలు, వాలెట్ చిరునామాలను దాచిపెట్టారని పేర్కొంది. ఆర్థిక ఒప్పందాల ద్వారా విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు కోర్టుకు వివరించింది.

READ MORE:American Bride | ప్రేమకు సరిహద్దులు లేవని…నిరూపించిన ప్రేమ జంట

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version