Home ENTERTAINMENT Cocktail 2 | బాలీవుడ్ లో హీట్ పెంచుతున్న రష్మిక – కాక్‌టెయిల్ 2లో...

Cocktail 2 | బాలీవుడ్ లో హీట్ పెంచుతున్న రష్మిక – కాక్‌టెయిల్ 2లో స్పెషల్ క్యారెక్టర్!

0
rashmika mandanna cocktail 2 – shocking character in bollywood

Cocktail 2: నటి రష్మిక మందన్న తన వరుస విజయాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రానుంది. విభిన్న పాత్రల్లో నటనతో మల్టీటాలెంటెడ్‌ నటిగా గుర్తింపు పొందిన రష్మిక, బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న “కాక్‌టెయిల్ 2″(Cocktail 2) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్(shahid kapoor) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్ మరియు రష్మిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ మీడియా రష్మిక మరియు కృతి పాత్రలపై చర్చ నడుస్తుంది. కథలో వీరు స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నారు అని ప్రచారం వినిపిస్తోంది. కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని, సినిమా రొమాన్స్ మరియు థ్రిల్ మిక్స్‌గా ప్రేక్షకులను ఆకట్టబోతోంది.

చిత్రబృందం ప్రకారం, జనవరి 31న షూటింగ్ పూర్తి చేసారు. దర్శకుడు హోమీ అడజానియా ఈ సినిమాకు ప్రత్యేకత ఉందని, విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. షాహిద్ కపూర్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చూడని విభిన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం.

‘కాక్‌టెయిల్ 2’ 2012లో విడుదలైన “కాక్‌టెయిల్(Cocktail)”కి సీక్వెల్‌గా వస్తోంది. ఆ సినిమాలో దీపికా పదుకొనే, డియానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు సీక్వెల్ రూపంలో రాబోతున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.

READ MORE:Gold Rates Today | బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం…నగరాల వారీగా తాజా రేట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version