Home Andhra Pradesh Vangalapudi Anitha | కూటమి ప్రభుత్వంతో క్రైమ్ రేటు తగ్గింది

Vangalapudi Anitha | కూటమి ప్రభుత్వంతో క్రైమ్ రేటు తగ్గింది

0
home minister vangalapudi anitha

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆధునిక సాంకేతికతతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. నేరాల అరికట్టడంలో పోలీసుల పనితీరును మెరుగుపరిచిన ఫలితంగానే క్రైమ్ రేటు తగ్గిందన్నారు.

అలాగే కొందరు వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అనిత స్పష్టం చేశారు.

ALSO READ:India AI Impact Summit | హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా చేయడమే లక్ష్యం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version