American Bride: దేశాలు వేరైనా ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి నిరూపించింది ఓ జంట. మంచిర్యాల జిల్లా (Mancherial district) నస్పూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రణీత్ అమెరికాకు చెందిన లవినశ్రీ (తమీ)తో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. సింగరేణి ఉద్యోగి గంగిపల్లి రాములు కుమారుడైన ప్రణీత్, విదేశంలో పరిచయమైన స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని పెళ్లి నిర్ణయం తీసుకున్నాడు.
ఇరు కుటుంబాల సమ్మతితో ఫిబ్రవరి 20న మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ప్రేమకు దేశాల గీతలు అడ్డుకావని ఈ అంతర్జాతీయ వివాహం మరోసారి చాటి చెప్పింది.
ALSO READ:Vangalapudi Anitha | కూటమి ప్రభుత్వంతో క్రైమ్ రేటు తగ్గింది