Home Telangana Medaram Jatara Special Trains | మేడారం జాతర వెళ్లే భక్తులకు శుభవార్త.. 28 ప్రత్యేక...

Medaram Jatara Special Trains | మేడారం జాతర వెళ్లే భక్తులకు శుభవార్త.. 28 ప్రత్యేక రైళ్ల ప్రకటన.. ఎక్కడి నుంచి అంటే

0
Special trains announced for Medaram Jatara devotees
Special trains announced for Medaram Jatara devotees

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ రైల్వేశాఖ తీపి కబురు అందించించి. కోట్లమంది దర్శించుకునే సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 28, 29 తేదీల్లో మొత్తం 28 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

వరంగల్, కాజీపేటకు ప్రత్యేక రైళ్లు

ప్రస్తుతం మేడారంకు నేరుగా రైల్వే లైన్ లేకపోవడంతో, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వరంగల్, కాజీపేట వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అక్కడి నుంచి భక్తులు సులువుగా మేడారం చేరుకునేలా ఆర్టీసీతో సమన్వయం చేస్తోంది.

రైల్వే–ఆర్టీసీ సమన్వయం

వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. రైలు దిగగానే భక్తులు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో మేడారం చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీ

సికింద్రాబాద్–మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గాలతో పాటు, నిజామాబాద్–వరంగల్, కాజీపేట–ఖమ్మం, ఆదిలాబాద్ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వేశాఖ తెలిపింది.

ALSO READ:Visakhapatnam railway station | విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో కాప్.. భద్రతకు సాంకేతిక బలం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version