Home Telangana Rain Alert | తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్…23, 24న వర్షాలు

Rain Alert | తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్…23, 24న వర్షాలు

0
IMD rain alert issued for Telangana with yellow warning for multiple districts.
IMD rain alert issued for Telangana with yellow warning for multiple districts.

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత తగ్గి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ(IMD) తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చని హెచ్చరించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 24న కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని తెలిపింది.

అయితే 25వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అంచనా. ఇదే సమయంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్ష సూచనలు ఉన్నాయి.

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఆరెంజ్ లేదా రెడ్ అలర్ట్‌లు జారీ కాలేదని స్పష్టం చేశారు.

ALSO READ:AI Summit లో అద్భుతం టెక్నాలజీతో జీవం పొందిన కృష్ణార్జునులు 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version