Home Assam అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..ఏనుగులను ఢీకొని  పట్టాలు తప్పిన  ట్రైన్ 

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..ఏనుగులను ఢీకొని  పట్టాలు తప్పిన  ట్రైన్ 

0
Assam train accident elephants
Assam train accident elephants

Assam Train Accident | అస్సాంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదం(Train Accident) కలకలం సృష్టించింది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌(Rajdhani Express) హొజాయ్ జిల్లా పరిధిలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. రైలు ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది.

ALSO READ:Akhanda 2 Success Meet |  అఖండ 2  భారతీయులందరి సినిమా నందమూరి బాలకృష్ణ 

అయితే ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే, అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు తెలిపారు.

పట్టాలపై ఏనుగుల మందను గమనించిన వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version