Spirit Movie: టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’(spirit)పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ వంటి సినిమాలతో తన రా అండ్ రస్టిక్ మేకింగ్‌ను నిరూపించిన వంగా, ఈసారి ప్రభాస్‌తో మరో లెవెల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాను బాహుబలి, కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు వంగా కథను సిద్ధం చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
‘స్పిరిట్ పార్ట్ 1’, ‘పార్ట్ 2’కు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పటికే ఫైనల్ అయిందని, ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ALSO READ:అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..ఏనుగులను ఢీకొని పట్టాలు తప్పిన ట్రైన్
ఈ సినిమా కోసం ప్రభాస్ నుంచి ఏకధాటిగా 100 రోజుల కాల్ షీట్లు తీసుకోవడం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల ప్లానింగ్ చూస్తుంటే చిత్ర స్థాయి ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. పార్ట్ 1 విడుదలైన తర్వాత తక్కువ గ్యాప్‌లో పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది వంగా వ్యూహంగా తెలుస్తోంది.
ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు వంగా ఇంటెన్సిటీ జతకలిస్తే ‘స్పిరిట్’ ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
