Home Nirmal Mudhole వాటోలి గ్రామంలో ఓటు నమోదు కార్యక్రమం

వాటోలి గ్రామంలో ఓటు నమోదు కార్యక్రమం

0
A voter registration drive for graduates was held in Watoli village, with local BJP leaders urging eligible individuals to register for their voting rights.
A voter registration drive for graduates was held in Watoli village, with local BJP leaders urging eligible individuals to register for their voting rights.

ముధోల్ నియోజకవర్గం బైంసా మండలం వాటోలి గ్రామంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 2021 సంవత్సరము ముందు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రుడు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు ఏ ఒక్కరికి నిరోద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు లేవని తక్షణమే జాబు క్యాలెండర్ విడుదల చేయాలని మరియు నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఆకాష్ , సచిన్, గంగాధర్ అడ్వకేట్ దత్తు , జగత్ పటేల్ , నగేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version