Jana Nayagan: జన నాయగన్ విడుదలకు బ్రేక్.. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

Jana Nayagan movie faces censor issue in Madras High Court

విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్‌’(Jana Nayagan) సినిమాకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

ఈ వ్యవహారాన్ని మరోసారి విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది.

సెన్సార్ బోర్డు (CBFC)కి తన వాదనలు వినిపించే న్యాయపరమైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైందా కాదా అనే అంశాన్ని కూడా సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించాలని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మరోసారి విచారణ జరిపే పూర్తి అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని కోర్టు వెల్లడించింది.

జనవరి 9న యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, వాటిని సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో సెన్సార్ సర్టిఫికెట్‌పై తాత్కాలిక స్టే విధించబడింది. విడుదలపై అనిశ్చితి నెలకొనడంతో ‘జన నాయగన్‌’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌ | రైల్వే ఉద్యోగాలకు చివరి అవకాశం

Related posts

KTR | రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

Telangana IPS Transfers 2026 | హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్

Station Ghanpur Car Fire | నడిరోడ్డుపై కారులో మంటలు.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More