Maoist surrender | నేడు సీఎం రేవంత్ సమక్షంలో భారీ మావోయిస్టు లొంగుబాటు

0
Maoists surrendering arms in Telangana under CM Revant Reddy supervision
Maoists surrendering arms in Telangana under CM Revant Reddy supervision

126 మంది మావోయిస్టులు ఆయుధాలతో కలిసి సరిహద్దుల నుంచి బయటకి

నేడు తెలంగాణలో చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం కనిపిస్తోంది. మొత్తం 126 మంది మావోయిస్టులు(Maoist surrender) రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారని అధికారులు తెలిపారు. ఆయుధాలు, ఇతర పరికరాలతో సహా వీరంతా సివిల్ లైఫ్‌లోకి విలీనం కానున్నారు.

దేవ్‌జీకి(Devji) చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుందని సమాచారం. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు.

మావోయిస్టుల సుప్రీం గణపతి ఈ లొంగుబాటులో పాల్గోదని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటుగా నమోదవుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు.  

NO COMMENTS

Exit mobile version