Telangana government | ఉద్యోగులకు తీపి కబురు…పెన్షనర్లకూ వర్తించే కొత్త పథకాలు

0
Telangana Cabinet approves new schemes for employees
Telangana Cabinet approves new schemes for employees

Telangana government: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఉద్యోగులు, పెన్షనర్లు కోసం రెండు ముఖ్య పథకాలను ఆమోదించింది. రాష్ట్రంలో 5.19 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 2.38 లక్షల పెన్షనర్లకు ప్రమాద బీమా అమలవుతుంది.

ఒక్క రూపాయి ప్రీమియం కూడా ఉద్యోగుల నుంచి తీసుకోకుండా, ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్ల పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పొందుతారు.

అంతేకాక, రూ.1,056 కోట్లతో కొత్త క్యాష్‌లెస్ ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తారు. 17.07 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు 652 ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స పొందుతారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వబడుతుంది. ఉద్యోగులు తమ బేసిక్ పే 1.5% చెల్లిస్తే, సమాన మొత్తాన్ని ప్రభుత్వం మ్యాచింగ్‌గా చెల్లిస్తుంది.

అదేవిధంగా, హైదరాబాదు మెట్రో, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌లు, గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం, ఇంజినీరింగ్ కాలేజీలు నిర్మాణాలకు భూములు కేటాయించబడ్డాయి. 434 పోస్టుల వైద్య నియామకాలు, పారా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ షాపుల వేలం, ధాన్యం కొనుగోళ్ల కోసం అదనపు రుణం కూడా మంత్రివర్గం ఆమోదించింది.

READ MORE:Google Weather | ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్…ఇకపై ఆ సేవలు బంద్

NO COMMENTS

Exit mobile version