Indian Air Force: వరుస ప్రమాదాల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ హల్ తేజస్ (HAL Tejas) యుద్ధవిమానాలను తాత్కాలికంగా గ్రౌండ్ చేసింది.
ఈ నెల ప్రారంభంలో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో తేజస్ మరోసారి ప్రమాదానికి గురైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు.
గత రెండేళ్లలో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. 2024లో రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ఒక ఘటన చోటుచేసుకోగా, 2025లో Dubai Airshow సందర్భంగా మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి సాంకేతిక దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే తేజస్ Mk1A ప్రోగ్రామ్‌పై విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికే 97 యుద్ధ విమానాల మల్టీ రోల్ తేజస్ Mk-1A కొరకు భారీ కొనుగోలు ఒప్పందం సాకారం చేసుకుంది.
ఇవి వైమానిక రక్షణ, సముద్ర గస్తీ, దాడి మిషన్లలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ALSO READ:Adilabad Bus Accident | ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం…పలువురి పరిస్థితి విషమం



