Happy Days 2: సెన్సిబుల్ కథలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మరో యూత్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల కుబేర ‘Kubera’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన, ప్రస్తుతం రెండు కొత్త కథలను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
అందులో ఒకటి 2007లో సంచలన విజయం సాధించిన ‘Happy Days’కు సీక్వెల్‌గా ‘హ్యాపీ డేస్ 2’ ఉండొచ్చని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కాలేజీ జీవితం, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను సహజంగా చూపించిన ‘హ్యాపీ డేస్’(Happy Days ) యువతను మెప్పించి వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇంజినీరింగ్ చదివే స్నేహితుల జీవిత ప్రయాణాన్ని నిజాయితీగా ఆవిష్కరించిన ఆ సినిమా నేటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు ‘హ్యాపీ డేస్ 2’(Happy Days-2)లో ఆధునిక కాలేజ్ వాతావరణం, జెన్-జీ(Gen Z) యువత ఆలోచనలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. కథకు సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరో కథ యూత్‌ను ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండొచ్చని తెలుస్తోంది. ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా ప్రారంభించాలన్న దానిపై శేఖర్ కమ్ముల తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హ్యాపీ డేస్ 2’ నిజంగా తెరకెక్కితే అదే మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించగలదా? అన్న ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
