Home Andhra Pradesh Nara Lokesh Birthday | ట్వీట్స్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ శుభాకాంక్షలు

Nara Lokesh Birthday | ట్వీట్స్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ శుభాకాంక్షలు

0
Pawan Kalyan and Jr NTR wish Nara Lokesh on his birthday
Pawan Kalyan and Jr NTR wish Nara Lokesh on his birthday

Nara Lokesh Birthday: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశంలో లోకేశ్ ప్రజాసేవ, పాలనా దృష్టికోణాన్ని ప్రశంసించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా లోకేశ్ చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్(PAWANKALYAN) ప్రస్తావించారు.

విద్యా రంగంలో మార్పులు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల మధ్య సమన్వయానికి ఆయన తీసుకుంటున్న చర్యలను అభినందించారు.

అలాగే ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో లోకేశ్ చేపడుతున్న ప్రయత్నాలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలకంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రజాసేవలో మరింత శక్తి, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే నారా లోకేశ్. మీకు ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ALSO READ:Amazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌…16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version