
Swachha Rathams: ప్రజలు చెత్త ఇస్తే బదులుగా నిత్యావసరాలు అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ(Vinukonda)లో స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తూ ఆయన ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
గ్రామాల్లోని ప్రతి ఇంటి వద్దకు ఈ రథాలు వెళ్లి చెత్తను సేకరిస్తాయని, పాత ప్లాస్టిక్, లోహం వంటి వ్యర్థాలను అందజేసే వారికి బదులుగా నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పారు.
ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చెత్త నిర్వహణను వ్యవస్థీకృతంగా అమలు చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు.
పల్నాడు ప్రాంతం పౌరుషాల గడ్డ అని, ఇక్కడి ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుందని అన్నారు. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని గుర్తుచేశారు.
స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరిగి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ప్రత్యక్ష లాభం కలిగే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సీఎం వెల్లడించారు.
ALSO READ:Anthropic AI | ఆంథ్రోపిక్ షాక్…కుప్పకూలిన సైబర్ సెక్యూరిటీ షేర్లు