పాకిస్థాన్‌లో సైనికాధిపత్యానికి చట్టబద్ధత లభించింది. సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇచ్చేలా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కి(Asim Munir) “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్” అనే కొత్త హోదా లభించనుంది.
దీంతో ఆయనకు ఆర్మీతో పాటు నౌకాదళం, వాయుసేనలపై కూడా పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ నిర్ణయం పాకిస్థాన్ చరిత్రలో సైన్యానికి అత్యధిక అధికారాలు( Pakistan Army Chief Powers) ఇచ్చిన ఘట్టంగా నిలిచింది.
also read:ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు భారత్ ఫోర్జ్ సిద్ధం–సీఎం చంద్రబాబుతో కీలక చర్చలు
అదేవిధంగా, పదవీ విరమణ తర్వాత కూడా మునీర్ ర్యాంక్ కొనసాగుతుంది. జీవితకాలం పాటు చట్టపరమైన విచారణల నుండి పూర్తిస్థాయి రక్షణ పొందుతారు. విమర్శకులు ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని, దేశాన్ని మళ్లీ సైనిక పాలన దిశగా నడిపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఇక సుప్రీంకోర్టు అధికారాలు పరిమితం కావడంతో, పాకిస్థాన్‌లో న్యాయ, రాజకీయ వ్యవస్థలపై సైన్యం పట్టు మరింత బలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
