Home Andhra Pradesh Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్

Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్

0
Pawan Kalyan addressing a meeting on forest land protection in Andhra Pradesh

అటవీ భూముల పరిరక్షణపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawankalyan) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములను(forest land issue) అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, దానిపై కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల కబ్జా కేసుల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని పవన్ ఆదేశించారు. సమావేశంలో మాట్లాడుతూ, “పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి?” అని పవన్ ప్రశ్నించారు.

రాజకీయాలకు అతీతంగా, భావితరాల కోసం ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన స్పష్టం చేశారు. అడవుల జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చిచెప్పారు.

also read:Delhi car blast:ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ఆధారం-ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు సీజ్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version