Gold Price Today | నెలాఖరులో బంగారం ధరలు భారీగా పతనం.. హైదరాబాద్‌లో ఎంతంటే?

Gold and silver prices

Gold Price Today: పసిడి కొనాలనుకునేవారికి నెలాఖరులో ఊహించని ఊరట లభించింది. కొంతకాలంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. వెండి రేటు(Silver Price) కూడా ఇదే బాటలో పయనించింది. ఒక్కరోజులోనే బంగారం తులంపై రూ.2,500కుపైగా తగ్గగా ఈ వారంలో మొత్తంగా సుమారు రూ.4,500 మేర పసిడి ధర పడిపోయింది. సెప్టెంబర్ 29న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,160గా నమోదైంది. సెప్టెంబర్‌లో నమోదైన ధరలతో పోలిస్తే ఇది కనిష్ఠ స్థాయి. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైన ధరల తగ్గుదల తర్వాత సెప్టెంబర్ తొలినాళ్లలో కొంత రికవరీ కనిపించింది. అయితే నెల చివరికి వచ్చేసరికి మళ్లీ ధరలు గణనీయంగా తగ్గాయి.

వెండి ధరలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఒక్కరోజులోనే కిలో వెండి ధర దాదాపు రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,39,900గా కొనసాగుతోంది. పండుగ సీజన్‌ నేపథ్యంలో ముందుగానే కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చిన చిన్న వ్యాపారులపై ఈ ధరల హెచ్చుతగ్గులు ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,50,160 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,640గా ఉంది. విజయవాడ, ముంబై, చెన్నైలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,310, 22 క్యారెట్ల ధర రూ.1,37,790గా ఉంది. మొత్తంగా చూస్తే పసిడి, వెండి ధరల తాజా పతనం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినా మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా రేట్లు మళ్లీ మారే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలు చేసేవారు తాజా ధరలను పరిశీలించడం కీలకం.

Related posts

Gold and silver prices | పసిడి ప్రియులకు భారీ గుడ్‌న్యూస్.. ఒక్కరోజే వేలల్లో తగ్గిన బంగారం ధరలు!

Warren Buffett Donation | వారెన్ బఫెట్ మరో భారీ విరాళం.. రూ.49 వేల కోట్ల సంపద దానం!

Gold Price Today | సామాన్యులకు భారీ ఊరట.. అమాంతం పడిపోయిన గోల్డ్ రేట్స్!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More