Home Andhra Pradesh నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలపై సిపిఎం పార్టీ ఆగ్రహం

నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలపై సిపిఎం పార్టీ ఆగ్రహం

0
CPI(M) leader B.T. Dora criticized the soaring costs of essential goods and electricity charges. He called for strict actions to control prices and improve public welfare.

రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర ధరలు, విద్యుత్ చార్జీలకు హద్దే లేదా అంటూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి. దొర మండిపడ్డారు, పెరుగుతున్న నిత్యవసర వస్తువులుధరలు అదుపు చేయాలన్నారు. ఒక కేజీ ఆయిల్ ధర 130 గా ఉంది. ఒక కేజీ కందిపప్పు 110. టమాటో ధర కేజీ 50 రూపాయలు గా ఉంది. పెట్రోల్ ఒక లీటర్ ధర 120 గా ఉంది. ఒక నెల సెల్ ఫోన్ రీఛార్జ్ ధర 300 గా ఉంది. ఈ రకంగా ఉంటే సామాన్య ప్రజలు ఏ రకంగా బ్రతకగలరని అన్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై కరెంటు చార్జీలు పెంచరాదన్నారు.

మహిళలు, పిల్లలు పై దళితులపైదాడులు, అత్యాచారాలు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమాలు పెడుతూ ఇప్పుడు అధికారంలోకి రాబోయే సరికి ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయారు అంటూ ప్రశ్నించారు. విశాఖపట్నంలో బిగించేటటువంటి స్మార్ట్ మేటర్లు బిగింపు ఆపాలన్నారు. లేదంటే తగిన గుణపాఠం ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు. శంకరావు. ఈశ్వరావు. సుధాకర్. దుప్పి దాసు. ఈరట ఈశ్వరావు. సోముల. రమణబాబు. దుప్పి. నారాయణ పాల్గొనడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version