Home ENTERTAINMENT Anupama & Dhruv Dating | అనుపమ-ధృవ్ స్నేహమా, ప్రేమమా?

Anupama & Dhruv Dating | అనుపమ-ధృవ్ స్నేహమా, ప్రేమమా?

0
Viral Dating Rumors in Tollywood

Anupama & Dhruv: మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్, తెలుగు–తమిళ భాషల్లో వరుస అవకాశాలతో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పెద్ద బ్లాక్‌బస్టర్లు లేకపోయినా, చిన్న, మీడియం రేంజ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. పద్ధతి గల పాత్రలతో కనిపించేది అనుపమ, ఇప్పుడు రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ సన్నివేశాలున్న పాత్రలను కూడా స్వీకరిస్తోంది.

ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన నటించిన తమిళ చిత్రం ‘బైసన్’(Bison) విడుదలకు ముందే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందన్న వార్తలు వినిపించాయి. సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రచార, పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించడం, స్టేజ్‌పై ధృవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, క్లోజ్ సెల్ఫీలు సోషల్ మీడియాలో షేర్ చేయడం రూమర్స్‌కు తావునిచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో అనుపమ “అర్ధరాత్రి కాల్ ఎవరికీ చేస్తారు?” అన్న ప్రశ్నకు ధృవ్ పేరే చెప్పడం చర్చకు కారణమైంది.

ప్రస్తుతానికి అనుపమ 30, ధృవ్ 28. “తనకంటే చిన్నవాడితో ప్రేమలో ఉందా?” అన్న చర్చ నెట్టింట మొదలైంది. కానీ ప్రేమా, స్నేహమా అన్నది స్పష్టతకు రాలేదు. ఇరువురూ అధికారికంగా స్పందించకపోవడంతో నెటిజన్లు ఊహాగానాలకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఈ డేటింగ్ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

READ MORE:Gold – Silver Rate Today | బంగారం, వెండి ధరలు మళ్లీ జంప్ – ఈరోజు ఎంత పెరిగాయంటే?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version