కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కొత్త యాప్”భారత్ ట్యాక్సీ (Bharat Taxi)” ను ప్రారంభించింది. ఈ యాప్‌ను “కేంద్రమంత్రి అమిత్ షా(Amitshah)” గురువారం ప్రారంభించారు. పరీక్షాత్మక విజయవంతమైన తర్వాత, ఇది సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చి, ప్రారంభంలో “ఢిల్లీ -ఎన్‌సీఆర్”, “గుజరాత్”రాష్ట్రాల్లో సేవ అందిస్తుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో “కశ్మీర్ నుంచి కన్యాకుమారి”, “ద్వారక నుంచి కామాఖ్యా (అస్సాం)” వరకు విస్తరించడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది.
భారత్ ట్యాక్సీ “జీరో కమీషన్ విధానం”(Zero-Commission Cab Service)తో, డ్రైవర్లకు పూర్తి లాభాలు పొందేలా రూపొందించబడింది. కారు, త్రీవీలర్, టూవీలర్ రైడ్‌లు బుక్ చేయవచ్చు. సర్జ్ ప్రైసింగ్ లేకుండా, డ్రైవర్లకు నేరుగా లాభాలు అందించడం దీని ముఖ్య లక్ష్యం.
ప్రారంభంలో 3 లక్షల మంది డ్రైవర్లు ప్లాట్‌ఫామ్‌లో చేరగా, రోజుకు సుమారు 10,000 రైడ్లు జరిగాయి, డ్రైవర్లకు సుమారు 10 కోట్లు లాభాలు వచ్చాయి. అదనంగా “సారథి’ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ సేవింగ్స్” వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.