IPL 2027 auction: ఐపీఎల్‌లో ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారిన ఓపెనింగ్ జోడీకి బ్రేక్ పడబోతోందా? సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస సిరీస్‌లు, కీలక టోర్నీల నేపథ్యంలో పనిభారం తగ్గించుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే సన్‌రైజర్స్ యాజమాన్యానికి తెలియజేసినట్లు సమాచారం. 2024 ఐపీఎల్ వేలంలో రూ.6.8 కోట్లకు హైదరాబాద్ జట్టులోకి వచ్చిన హెడ్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అంచనాలను మించి రాణించారు. దీంతో తదుపరి సీజన్‌కు రూ.14 కోట్లతో అతడిని జట్టు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 43 మ్యాచ్‌లు ఆడిన హెడ్.. 176.14 స్ట్రైక్‌రేట్‌తో 1,351 పరుగులు సాధించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి ఆయన నెలకొల్పిన దూకుడైన ఓపెనింగ్ భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలను అందించింది.
అయితే హెడ్ అందుబాటులో లేకపోవడం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు ఆయన తప్పుకోవడంతో రూ.14 కోట్ల అదనపు మొత్తం వేలం పర్స్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలంలో మరో స్టార్ ఓపెనర్‌ను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ యాజమాన్యానికి మంచి అవకాశం లభించనుంది. 2027లో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు సిరీస్‌లు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, యాషెస్‌తో పాటు వన్డే ప్రపంచకప్ వంటి కీలక బాధ్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి ప్రాధాన్యత ఇస్తూ హెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రావిస్ హెడ్ లేకుండా బరిలోకి దిగాల్సి వస్తే సన్‌రైజర్స్ కొత్త ఓపెనింగ్ జోడీని సిద్ధం చేసుకోవాల్సిందే. వేలంలో హైదరాబాద్ ఎవరిని ఎంపిక చేస్తుంది? అభిషేక్ శర్మకు కొత్త భాగస్వామి ఎవరు కానున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Quad Summit Manila | మోడీ అంటే ట్రంప్‌కు అంత గౌరవమా? మనీలాలో ఆసక్తికర వ్యాఖ్యలు!