Sundar Pichai | సుందర్ పిచాయ్‌కు సూపర్ ప్యాకేజీ….ఎన్ని వేల కొట్లో తెలుసా ?

0
Sundar Pichai Google CEO with Alphabet stock growth background
Sundar Pichai Google CEO with Alphabet stock growth background

Sundar Pichai: గూగుల్ CEO “సుందర్ పిచాయ్” వేతనంలో భారీ పెంపు పొందారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్(Alphabet) ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి మొత్తం “$692 మిలియన్” (భారత కరెన్సీలో సుమారు ₹6,316 కోట్లు) వేతనం నిర్ణయించింది.

ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపిన ప్రకారం, వార్షిక జీతం $2 మిలియన్, “పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ (PSU)” విలువ $126 మిలియన్. ఇది కంపెనీ లక్ష్యాలు చేరిన మేరకు సర్దుబాటు అవుతుంది.

అదనంగా, పరిమిత స్టాక్ వెస్టింగ్ ద్వారా $84 మిలియన్ విలువైన షేర్లు పొందనున్నారు. ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలైన “వ్యోమో, వింగ్ ఏవియేషన్స్” 175 మిలియన్ డాలర్ల షేర్లను సౌకర్యంగా కేటాయించినట్లు బోర్డు వెల్లడించింది.

ఈ ప్రోత్సహకాలు పిచాయ్ లీడర్‌షిప్‌పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి.

సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరి కీలక బాధ్యతలు చేపట్టి, 2015లో సీఈవోగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో గూగుల్ మార్కెట్ విలువ “$535 బిలియన్ నుండి $3.6 ట్రిలియన్”కు చేరింది. ఈ ఏడాది జనవరిలో కాంపెనీ విలువ “$4 ట్రిలియన్” ను కూడా దాటింది.

NO COMMENTS

Exit mobile version