Home Films News Ram Charan Twins | కవలల పేర్లు ప్రకటించిన చరణ్–ఉపాసన

Ram Charan Twins | కవలల పేర్లు ప్రకటించిన చరణ్–ఉపాసన

0
Ram Charan–Upasana Reveal Twins Names

Ram Charan – Upasana Kamineni దంపతులు తమ కవలల పేర్లను అధికారికంగా వెల్లడించారు. జనవరి 31న ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చిన్నారుల బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తమ పిల్లల పేర్ల వెనుక ఉన్న భావాన్ని వివరించారు.

బాబుకు “శివరామ్ (Shivram)”, పాపకు “అన్వీరా దేవి (Anveera Devi)” అని నామకరణం చేసినట్లు తెలిపారు. శివరామ్ అనే పేరు శివుడు, రాముడు అనే రెండు దైవ నామాల సమ్మేళనంగా ఉండటంతో పాటు తన తండ్రి పేరు శివశంకర్ వర ప్రసాద్‌కు సంబంధించిన భావాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఇక అన్వీరా దేవి అనే పేరులో ‘అన్’ అంటే అపరిమితం, ‘వీర’ అంటే ధైర్యం, ‘దేవి’ అంటే దైవిక శక్తి అని అర్థమని వివరించారు.

2012లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంటకు 2023లో క్లీంకార జన్మించగా, 2026లో కవలల రూపంలో ఆనందం రెట్టింపు అయింది. తమ జీవితంలో మహిళలే బలమని, కుటుంబం మరియు అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ రామ్ చరణ్ భావోద్వేగంగా స్పందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version