BRICS Summit | “సర్.. ఓ ఫొటో ప్లీజ్!”.. మోడీ తో ఫొటో కోసం విదేశీ ప్రతినిధుల ఆసక్తి

PM Narendra Modi

BRICS Summit: ప్రపంచ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఉన్న ఆదరణ మరోసారి ఆసక్తికర ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన బిజినెస్ ఫోరమ్‌ వద్ద చోటుచేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదస్సు ప్రాంగణంలో మోడీ నడుచుకుంటూ వెళ్తుండగా.. పలువురు విదేశీ ప్రతినిధులు ఆయనను కలిసేందుకు ముందుకొచ్చారు. ప్రధాని వద్దకు చేరుకున్న కొందరు ప్రతినిధులు తమతో ఫొటో దిగాలని కోరారు. వారి అభ్యర్థనకు మోడీ చిరునవ్వుతో అంగీకరించి, వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రత్యేకంగా ఆనందం వ్యక్తం చేశారు. మోడీతో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం తమకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వారి ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మోడీ ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అక్కడే ఉన్నారు. మోడీకి దారి ఇచ్చేందుకు వారు పక్కకు జరగడం కూడా వీడియోలో కనిపించింది. ఈ మొత్తం సన్నివేశాన్ని బీజేపీ అస్సాం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో రూపంలో పంచుకుంది. దీంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ సదస్సులో విదేశీ ప్రతినిధులు మోదీతో ఫొటో దిగేందుకు చూపిన ఆసక్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts

Modi Indian Flag Gesture | ప్రపంచ నేతల మధ్య మోడీ ప్రత్యేకత.. జెండా గుర్తును జేబులో పెట్టుకున్న ప్రధాని

Delhi Building Collapse | ఢిల్లీలో ఘోర విషాదం.. కుప్పకూలిన రెండంతస్థుల భవనం!

PM Modi Philippines Visit | ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. చారిత్రాత్మక గురుద్వారాను సందర్శించిన ప్రధాని

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More