Gulf Worker Kodangal Lakshmi: గల్ఫ్ దేశంలో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న తెలంగాణ మహిళ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి మస్కట్‌లో ఎదుర్కొన్న కష్టాలు, ఆమె కుటుంబాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకోవడంతో ఆమె తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 12న ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన లక్ష్మి అక్కడ చిక్కుకుపోయారు. తన తల్లిని స్వదేశానికి తీసుకురావాలంటూ కుమారుడు రాజు పలువురు నాయకులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తన ఆవేదనను వివరించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. మస్కట్‌లోని బీఆర్ఎస్ నాయకులు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న లక్ష్మి, తన కుమారుడు రాజుతో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన బిడ్డను మళ్లీ చూస్తానో లేదోనని భయపడ్డానంటూ లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
ALSO READ: Pithapuram Municipal Elections | పిఠాపురం మున్సిపల్ పోరులో జనసేన హవా.. టీడీపీ రెబల్ సంచలనం