Home Andra Pradesh Happy Sunday Program | ఏపీలో తిరిగి ‘హ్యాపీ సండే కార్యక్రమం

Happy Sunday Program | ఏపీలో తిరిగి ‘హ్యాపీ సండే కార్యక్రమం

0
11
Happy Sunday in Andhra Pradesh

Happy Sunday Program: ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సామాజిక ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన “హ్యాపీ సండే” కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానుంది. ఇకపై ప్రతి నెలలో “రెండో మరియు నాలుగో ఆదివారాల్లో” రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. గతంలో 2014–2019 మధ్యకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు.

అనంతరం కొన్ని సంవత్సరాలు నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.

ప్రతి హ్యాపీ సండే రోజున ఉదయం “6 గంటల నుంచి 10 గంటల వరకు” యోగా, ధ్యానం, వాకింగ్‌, సైక్లింగ్‌, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక అవసరాల మేరకు సమయాల్లో స్వల్ప మార్పులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి “ఎటువంటి ఫీజు అవసరం లేదు”. తొలి హ్యాపీ సండేను ఈ నెల “22వ తేదీన” రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించనున్నారు.

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన, పిల్లలు–యువత–వృద్ధులందరికీ చురుకుదనం పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version