Home Andra Pradesh AP Budget 2026-27 | అమరావతి నుంచి రాయలసీమ వరకు: ఏపీ బడ్జెట్‌లో భారీ పెట్టుబడులు

AP Budget 2026-27 | అమరావతి నుంచి రాయలసీమ వరకు: ఏపీ బడ్జెట్‌లో భారీ పెట్టుబడులు

0
11
AP Budget 2026-27 presented by Finance Minister

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశకమని పేర్కొన్నారు.

రెవెన్యూ ఖర్చులకు రూ.2,56,143 కోట్లు కేటాయించగా, మూలధన వ్యయంగా రూ.53,915 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.

ముఖ్య కేటాయింపుల్లో అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు, రోడ్లు–పోర్టులు–ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు కేటాయించారు. గృహనిర్మాణానికి రూ.5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,000 కోట్లు, జల్ జీవన్ మిషన్‌కు రూ.4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు కేటాయించారు.

విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు ప్రకటించడం బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version