Home InterNational H-1B visa policy | హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరిని సమర్థించిన వైట్‌హౌస్

H-1B visa policy | హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరిని సమర్థించిన వైట్‌హౌస్

0
White House defends Donald Trump’s stance on H-1B visa policy for foreign skilled workers
White House defends Donald Trump’s stance on H-1B visa policy for foreign skilled workers

H-1B visa :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల విధానంపై తీసుకున్న వైఖరిని శ్వేతసౌధం సమర్థించింది. ఈ విషయంలో ట్రంప్ అభిప్రాయం చాలా వాస్తవికంగా, వివేకంతో కూడుకున్నదని స్పష్టం చేసింది. అమెరికాలో పరిశ్రమల స్థాపనకు తొలినాళ్లలో విదేశీ నిపుణులను అనుమతించినా, అంతిమంగా ఆ ఉద్యోగాలను అమెరికన్లతోనే భర్తీ చేయాలన్నది ఆయన లక్ష్యమని పేర్కొంది. 

ALSO READ:Double Bedroom House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసు

భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం గల విదేశీ సిబ్బందిని తాత్కాలికంగా తీసుకురావడం సహజమని, ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో నడవడం ప్రారంభమైన తర్వాత ఆ పోస్టులను స్థానిక కార్మికులకు ఇవ్వాలన్నదే ట్రంప్ ఉద్దేశమని వివరించింది.

యూఎస్–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరువాత ఈ వివరణ వచ్చింది. అరిజోనాలో నిర్మాణంలో ఉన్న భారీ చిప్ ఫ్యాక్టరీ ఉదాహరణగా తీసుకుంటూ అటువంటి ప్రాజెక్టులను ప్రారంభ దశలో విదేశీ నిపుణులతోనే నడపాల్సి వస్తుందని, వారు అమెరికన్ యువతకు సాంకేతిక శిక్షణ కూడా అందిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, ఈ వైఖరివల్ల రిపబ్లికన్ పార్టీలో చర్చ చెలరేగింది. ఇదిలా ఉండగా, 2024లో జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతం భారతీయులకే వెళ్లడం గమనార్హం. వీసాల దుర్వినియోగాన్ని తగ్గించేందుకు దరఖాస్తు ఫీజును 100,000 డాలర్లకు పెంచడం కూడా ముఖ్య నిర్ణయంగా వైట్‌హౌస్ తెలిపింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version