Gold Price Today | పసిడి ప్రియులకు ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు 

Latest gold and silver prices in Hyderabad and major Telugu state cities.

Gold Price Today: పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈరోజు మార్కెట్‌ నుంచి కొంత ఊరటనిచ్చే వార్త వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టగా.. తాజాగా మరోసారి స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో రేట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి రూ.1,54,570 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,930గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,41,840 కాగా.. 24 క్యారెట్ల పసిడి రూ.1,54,720గా ఉంది. వెండి ధరల్లోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,49,900కు చేరింది. అయితే బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, డాలర్ విలువ, స్థానిక పన్నులు, డిమాండ్ వంటి అంశాల ఆధారంగా రోజులోనే పలుమార్లు ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న రేట్లు మంగళవారం ఉదయం నమోదైనవే. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపులో తాజా ధరను నిర్ధారించుకోవడం మంచిది.

Related posts

Gold and silver prices | పసిడి ప్రియులకు భారీ గుడ్‌న్యూస్.. ఒక్కరోజే వేలల్లో తగ్గిన బంగారం ధరలు!

Warren Buffett Donation | వారెన్ బఫెట్ మరో భారీ విరాళం.. రూ.49 వేల కోట్ల సంపద దానం!

Gold Price Today | సామాన్యులకు భారీ ఊరట.. అమాంతం పడిపోయిన గోల్డ్ రేట్స్!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More