Gold prices | బంగారం ప్రియులకు షాక్… భారీగా పెరిగిన బంగారం ధరలు ధర

0
Gold price surge in India with sharp increase in bullion market
Gold price surge in India with sharp increase in bullion market

తులం బంగారంపై రూ.2,510 పెరుగుదల

బంగారం ధరలు మళ్లీ భారీగా పెరగడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో కొంత తగ్గిన గోల్డ్ రేట్లు, ఈరోజు మాత్రం గణనీయంగా పెరిగాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000కు చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం కనిపించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.2,85,000గా కొనసాగుతోంది.

NO COMMENTS

Exit mobile version